పాలు చాలా సార్లు విరిగి పోతూ ఉంటాయి. అలా విరిగిపోయిన పాలతో పన్నీర్ చేస్తుంటారు.ఆ మిగిలిన  నీళ్లలో ఎన్నో పోషకాలు ప్రొటీన్లు ఉంటాయి.ఈ విరిగిన పాల నీళ్ళు పోసి అన్నం వండేందుకు ఉపయోగిస్తే అన్నానికి రుచి వస్తుంది పోషకాలు దక్కుతాయి.ఈ నీళ్ల తో నూడుల్స్ వండితే చాలా టేస్టీగా ఉంటాయి.అలాగే చపాతి పిండి లో ఈ నీళ్ళు కలుపుకోవచ్చు.సుప్  కోసం ఈ నీళ్లను  ఉపయోగించుకోవచ్చు.ఈ నీళ్లలో ఉండే సుగుణాలు గుర్తుపెట్టుకొని వీటిని ఉడికే  కూరల్లోనూ పప్పు దినుసులు ఉడికించేటప్పుడు కలుపుకోవచ్చు పాలలో ఉండే పోషకాలు అన్ని ఈ నీళ్లలోనూ ఉంటాయి.

Leave a comment