కరోనా సమయంలో నిరంతరం వైరస్ గురించి వార్తలు వింటూ ఉండటంతో ఆందోళన కలగటం సహజం… ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ ఆందోళన తగ్గుతుంది అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.బ్రౌన్ రైస్, గోధుమ, రొట్టెలు,చిరుధాన్యాలు తీసుకోవాలి.అధిక భాగం కూరలు, పండ్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.పాలు, పెరుగు, గుడ్లు మంచివే.కాఫీ ,టీలు ఎక్కువగా తాగడం నిద్రలేమి వల్ల కూడా ఆందోళన కలగవచ్చు.ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలైన్ ఇ పి ఎ ,డి హెచ్ ఎ లు ఆందోళన తగ్గటానికి అవసరమైనా సెరటోనిన్,డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్ మీటర్లను నియంత్రిస్తాయి.ఈ ఆమ్లాలు సాల్మన్ చేప,ముకలేడ్ చేప,ఆయిస్టర్స్‌, సముద్రపు రొయ్యల్లో లభిస్తాయి.

Leave a comment