ఎప్పటికి వయస్సు మీద పడినా చాయలు కనిపించకుండా వుండాలంటే కొన్ని యాంటీ ఏజింగ్ డైట్స్ ఫాలో అవమని చెప్పుతున్నారు డైటీషియన్లు. వాటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలు. మంచి ఫలితాలు కన్పిస్తాయి అంటున్నారు బ్లూ బెర్రీలు తింటే నాజుగ్గా అయిపోతారట వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చిలకడ దుంప, కేరెట్, గుమ్మడి కాయల్లో వుండే బీటాకెరోటిన్ ఏజింగ్ ను అరికడతాయి. చర్మం పట్టులా ఉంచుతాయి. కళ్ళకు చక్కని మెరుపులను ఇస్తాయి. ఆకు కూరలు తినడం వల్ల చర్మం మెరవడమే కాదు వయస్సు కనబడదు. విటమిన్ సి పుష్కలంగా వుండే బ్రోకలీ తినడం వల్ల కుడా చర్మం ముడతలు పడవు. ట్యూన్, సాల్మన్, చేపలు కుడా యాంటీ ఏజింగ్ డైటే. వీటిని తింటే చర్మం యవ్వనవంతంగా వుంటుంది. ముడతలు రావు.

Leave a comment