ఈ వేసవిలో జుట్టు భుజాలపైకి జారుతుంటే విసుగ్గానే ఉంటుంది. ముడి వేసుకుంటే వయసు మీదపడ్డట్టు ఉంటుందేమో నన్న భయం అమ్మాయిల్లో ఉంటుంది. సింపుల్ గా ఫ్యాషన్ గా అనిపించే కొప్పుని అంటి పెట్టుకోనే నాజుకైనా ఆభరణాలు వచ్చాయి. ప్లాస్టిక్ పువ్వుల దండలతో ఆర్టిఫిషియల్ వజ్రాలు వచ్చాయి లేదా హెయిర్ పిన్ కి మల్లెలు గుచ్చి జుట్టుతో అలంకరించినాచాలు. గట్టిగా ముడినిలిచేలా ఉండేందుకు దువ్వెన పళ్ళవంటి క్లిప్స్ వచ్చాయి. ముడి లోపలకి పిన్ గుచ్చిన పైకి అందమైన పిన్ డిజైన్ కనిసిస్తుంది. ముడి మధ్యని గుచ్చే హెయిర్ బ్రూచ్ లు,ముడి వేశాక జుట్టు చెదరకుండా పెట్టుకొనే హెయిర్ స్టిక్స్ ,బాచ్ పిన్స్ ,ముడి కింద నుంచి అలకంరించే హెడ్ పీసులు ఎన్నో రకాలు వెస్ట్రన్ స్టైల్ కేశాలంకరణకు ఉపయోగించేవి మార్కెట్ లో ఉన్నాయి.

Leave a comment