చర్మాన్ని కాంతిగా చేసే స్క్రుబ్స్ ఎన్నో వెరైటీలలో మార్కెట్ లో దొరుకుతున్నా కొన్ని ఇంట్లో తేలికగా తయ్యారు చేసుకోవచ్చు. ఇవి శక్తి వంతంగా పనిచేస్తాయి కుడా. గులాబీ ఫ్లేవర్ కావాలంటే టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ల సీ సాల్ట్, నలుగు చుక్కల రోజ్ ఆర్గానిక్ ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకుంటే స్క్రుబ్ తయ్యారవ్వుతుంది. అలాగే మూడు కప్పుల చక్కర, కప్పు ద్రాక్ష గింజలు నూనె, ముప్పావు కప్పు ఆరంజ్ ఎసేన్షియల్ నూనె, పావు కప్పు పుదీనా ఎసెన్షియల్ నూనె, బాగా   కలిపి పొడి సీసాలో బాద్ర పరచుకోవచ్చు.   ముఖం పై మృత కణాలు, ముక్కు గడ్డం చుట్టూ నలుపు వుంటే టేబుల్ స్పూన్ తేనె లో రెండు టేబుల్ స్పూన్    చెక్కెర కలిపి అప్పటికప్పుడు అరచేతిలో వేసుకుని ముఖం పై రుద్దితే ముఖం మృదువుగా అయిపోతుంది.

Leave a comment