Categories

ఆడవాళ్ళ విషయంలో కృరంగా వ్యవహరిస్తే చట్టం దృష్టిలో నేరమే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అమ్మాయికి అబ్బాయికి మధ్య పెంపకంలో వివక్ష చూపించినా ,ఇతర పురుష కుటుంబ సభ్యులు ఆమెను తిట్టినా ,తాకారని చోట తాకిన అసహజంగా ప్రవర్తించినా అది గృహహింస క్రింద వస్తుంది . బీడీ కంపెనీ లు ,పొలాలు ,ఫ్యాక్టరీలు ఇటుకల బట్టీలు వంటిచోట్ల పనిచేసే ఆడవాళ్లను కుల ,రంగు,రూపు గురించి తూలనాడినా ,కోరిక తీర్చమని ఇబ్బంది పెట్టినా నేరమే . బహిరంగ ప్రదేశాల్లో టాయిలెట్లు ఏర్పాటు చేయక పోయినా ,స్కూళ్ళు రైల్వే స్టేషన్ లు బస్టాండ్ ల్లో ముఖ్యంగా వాటిలో సరైన వసతులు లేకపోయినా ,కాపలాదారు లేక పోయినా గోడల పైన అసభ్యకరమైన రాతలు రాసిన …. రహస్య కెమెరాలు అమర్చిన ఇవన్నీ నేరాల క్రింద పరిగణిస్తారు.