ఇది ఇవాల్టి న్యూస్ కాకపోయినా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంది. ఒక రోజు రాత్రి తెల్లారే సరికి రంగు రంగుల బొమ్మలతో తెరచిన పుస్తకాల్లా కనిపించే బెంచీలు వీధుల్లో వెలిసే సరికి లండన్ వాసులు ఆశ్చర్యపోయారట. అసలు ఇలాంటి బెంచీలు ఎందుకు పుట్టుకొచ్చాయి అంటే లండన్ నగర సాహిత్య వారసత్వ సంపద గురించి ప్రజలకు తెలియజేసి వాళ్ళలో పుస్తక పఠనం పైణ ఆసక్తి పెంచటానికేనట. అందులో భాగంగానే పబ్లిక్ ఆర్ట్ ప్రాజెక్ట్ పేరుతో పిల్లలకు, పెద్దలకు సబంధించిన మంచి పుస్తకాలు పేరుపొందిన పుస్తకాల, సంకలనాల నమూనాలతో బెంచీలు తయారు చేయించి నగరంలో అక్కడక్కడా ఏర్పాటు చేయించిందట. స్థానిక నేషనల్ లిటరరీ సంస్థ. ఫోటోల్లోచూడండి పేజీలు  తెరిచిన పుస్తకాలు అచ్చు కూర్చునే బెంచీల్లా తయారుచేసి వాటి పైన పుస్తకాల పేర్లు అందులో పాత్రలూ, రచయితల బొమ్మలూ పెట్టేశారు. ఇలా మన దేశంలో కూడా తెస్తే బావుండు. కనీసం వాటిని చూసయినా ఒక మంచి పుస్తకం చదవాలని అనిపిస్తుందేమో….

Leave a comment