ఒక జ్యూవెలరీ లైబ్రరీ వుంది. పే ఫెర్ యూజ్ బేసిస్ లో అక్కడ వుండే ఏ ఆభరణాన్నయినా అద్దెకు తీసుకోవచ్చు. వీటిని కొనక్కరలేదు EVES24.కామ్ కి వెళ్లి చూడండి. బంగారు వజ్రాభరణాలు అద్దెకిచ్చే స్టోర్ ఇది. కేవలం బంగారమే కాదు, రకరకాల రత్నాలు, ముత్యాలు పొదిగిన హారాలు, గాజులు, దిద్దులు బ్రేస్ లెట్స్ ఎన్నో రకాలు. వీటిలో నచ్చినవి ఎంపిక చేసుకుంటే కంపెనీ సిబ్బండి ఇంటికి తెస్తారు. వీటిని మూడు రోజుల పాటు మనం దగ్గర ఉంచుకో వచ్చు. దీనికి గానూ అద్దె చెల్లించాలి. ఇంకా ఇలాంటివే రెండు జ్యువెల్ కామ్, టిబీజి బ్రైడల్ స్టోర్ కామ్, లాంటివి ఇంకెన్నో వున్నాయి. విలువైన రాళ్ళ నగలు సంగతి అలా వుంచి ఇమిటేషన్ నగలు ఎక్కువ ఖరీదే. అంత ఖరీదు పెట్టి ఎదో ఒక అకేషన్ కోసం కొనుక్కోవడం ఎందుకు? రెంట్ జ్యూవెల్ కామ్ హైదరాబాద్ తో సహా ఇంకో 80 నగరాల్లో నగలను అద్దేకిస్తుంది. నగల సరదా తీరాలి అంటే ఇవి చూడొచ్చు.
Categories