గోలా కోసం పిల్లలు గోల పెడతారంటే ఆశ్చర్యం ఏముంది పిల్లల ఫేవరెట్ అది. ఆరంజ్, రోజ్, పైనాపిల్, వంటి రకాలు ఇంకెన్నో కోత్త రాకాల కలపోత తో ఊరిస్తోంది. గోలా ఐస్ ను సన్నగా తురిమి చేత్తో ముద్దగా చేసి పుల్ల కు గుచ్చి దాని పైన మనకు కావాల్సిన ఫ్లేవర్ సిరప్ పోసి ఇచ్చే గోలా ఎప్పటిదో. ఇప్పుడు ఆ గోలా ను కప్పులో తినొచ్చు. డ్రై ఫ్రూట్ గోలా, కండెన్సేడ్ మిల్క్ తో పాటు చాకొలెట్ సిరప్ చాకొ చిప్స్ కలిపి తాయారు చేసే చాక్లెట్ ఫలూదా గోలా, పన్నీర్ గోలా, పాన్ గోలా, స్ట్రాబెర్రీ గోలా, ఎగ్జోటిక్ ఫ్రూట్ గోలా,సందడి చేస్తుంటే పిల్లలు ఊరుకుంటారా. ఇవి కాస్త ఓపికగా చేస్తే ఇంట్లోనూ తయారవ్వుతాయి. ఇంట్లో ఐస్ తాయారు చేసి మిక్సిలో వేసి ముక్కలు చేసి అందులో పండ్ల జ్యూసుల్ని రెడీమేడ్ సిరప్ ని పోస్తే గోలా రెడీ. ఇక పిల్లల గోల తగ్గిపోతుంది.
Categories