బెంగళూరుకు చెందిన అనురాధా రావ్ భారత్ లో తొలి పర్యావరణ మిత్ర డైపర్ బ్రాండ్ ‘బంపడం’ ప్రారంభించారు. ఒక్కసారి కొంటే వీటిని మూడేళ్ళ పాటు వాడుకోవచ్చు. ఉతుక్కుని మళ్ళీ వాడకానికి పనికోచ్చేలా వస్త్రంతో తయారు చేసిన వాటర్ ఫ్రూఫ్ డైపర్లు పిల్లలకి ఎంతో కంఫర్ట్ గా ఉంటాయి. పర్యావరణానికి హాని చేయని ఇలాంటి వస్తువులను ప్రోత్సహించటం ఎంతైనా అవసరం.