మధ్య ప్రదేశ్ లోని భీమ్ బెట్కా గుహల్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో. మధ్య రాతి యుగపు నాటివిగా శాస్త్రజ్ఞులు చెప్పుతున్నా ఈ గుహలు అలనాటి జీవన విధానాన్ని అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. వీటి గోడల పైన ఎరుపు , తెలుపు రంగులతో గీసిన చిత్రాలు, 9000 సవత్సరాల క్రితం నాటివన్నది ఒక అంచనా. ఇవి మహా భారతంలో పాండవులు అరణ్యవాస సమయంలో నివసించిన గుహలు అంటారు భీమ్ బెట్కా అంటేనే భీముడు  కూర్చున్న రాళ్ళు అని  అర్ధం. మధ్యప్రదేశ్     లోని అత్యంత పురాతన మానవ   నివాసాలని ఎప్పుడైనా ఒక్క సారి చూసి తీరాలి. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ గుహలు అంతస్దులు అమరి వున్నాయి.

Leave a comment