Categories
సంవత్సరం పొడువునా వేడి వాతావరణలో ఉన్నప్పటికీ ఫిలిఫ్పైన్ వాసులు, ముడతలు లేని మృదువైన యవ్వనంతో మిస మిసలాడే చర్మంతో ఉంటారు. కొబ్బరి నూనె వాటికి ముఖ్యమైన పదార్థం. ఇప్పుడు సూపర్ ఫుడ్ అని ఎలుగెత్తి చాటుతున్న,కొబ్బరి నూనె 400 సంవత్సరాల క్రితం రాయబడిన ఆయుర్వేద గ్రంధులలో గొప్పగా వర్ణించినదే. కొబ్బరి నూనెలో ప్రకృతి సిద్దంగా ఆరోగ్యాన్ని ఇచ్చే కొవ్వులుంటాయి. తల్లిపాల తర్వాత స్థానం వాటికే అంటారు వైద్యులు. సంవత్సరం పాటు నిలవున్న దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు చెక్కు చెదరవు. 76 డిగ్రీసెంటి గ్రేడ్ వరకు వేడిచేసినా నూనెలో ఆక్సిలేషన్ జరగదు. వేపుడుకు కొబ్బరి నూనెంతో మంచి నూనె ఇంకేదీ లేదు. ఈ నూనెలో క్యాలరీలు తక్కువ ఉన్న కొవ్వు ఉండటం చేత శరీరం బరువును అదుపులో ఉంచుకోవచ్చు.