Categories
పచ్చబొట్టు ఇప్పుడు శరీరానికి ఆభరణం అయిపోతోంది ఫలానా చోటనే టాటూ వేయించు కోవాలనే రూల్స్ పోయాయి . ఒక సౌకర్యం లాగా టాటూని ఉపయోగించు కొంటున్నారు అమ్మాయిలు కనుబొమ్మలు షేప్ చేయించు కొంటూ ఉంటారు కదా ఇప్పుడు శ్రమలేకుండా టాటూ ల ద్వారా శాశ్వతంగా కనుబొమ్మలు తీర్చి దిద్దించుకొంటున్నారు . పల్చగా ఉన్న కనుబొమల మధ్య లో టాటు గీతాల ద్వారా వత్తుగా ఉండేలా చేస్తారు . ఇది కాస్త కష్టమైన ప్రక్రియ . విదేశాల్లో విస్త్రుతంగా ఉన్న ఈ ట్రెండ్ ఇప్పుడు మనదేశంలో కూడా పాపులర్ అవుతోంది . ఈ ఐబ్రో టాటుయింగ్ ద్వారా కనుబొమ్మలు అందంగా కనిపించేందుకు ఇదో శాశ్వత పరిష్కారంగా అమ్మాయిలు భావిస్తున్నారు .