హటాత్తుగా ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాల్సివస్తే,అలసటగా ఉన్న మొహం మెరిసిపోవాలంటే పెరుగు,తేనె సమంగా కలుపుకొని మొహానికి మెడకు రాసుకొని,ఒక పావు గంట ఆగి కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. అలాగే రెండు స్ట్రా బెర్రీలు మెత్తగా చేసి రెండు టీ స్పూన్ల తేనె కలిపి అప్లయ్ చేసి పది నిముషాలు ఆగి కడిగేసినా మొహం మెరుపు లీను తుంది వంట సోడా,కొబ్బరి నూనె కలిపి మొహానికి రాసి,స్క్రబ్ చేస్తే కూడా చర్మం తేటగా కనిపిస్తుంది టీ స్పూన్ పాల మీగడ టీ స్పూన్ కలబంద గుజ్జు,పావు టీ స్పూన్ పసుపు కలుపుకొని ప్యాక్ చేసుకొంటే తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

Leave a comment