అమ్మాయిలు ఫ్యాషన్ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. చూసేందుకు ముచ్చటగానే ఉంటారు కానీ. కొన్నింటి వల్ల అనారోగ్యాలు వస్తాయి అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా .శరీర ఆకృతి చక్కగా ఉండేందుకు యూత్ వాడే బాడీ షెపర్ ల వల్ల ఎంతో ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్. వీటిని వాడితే కీళ్ల సమస్యలు వస్తాయి. నరాలపైన ఒత్తిడి పడుతుంది. వెన్నెముక పనితీరు పైన తీవ్ర ప్రభావం కనిపిస్తుంది నిజానికి శరీరాకృతి కోసం ఇలాటి కృత్రిమమైన వాటిని వాడే కంటే వ్యాయామాన్ని నమ్ముకోవడం బెటర్ కదా .అలాగే శరీరానికి అతుక్కునే దుస్తులు వేసుకోవటం చాలా మందికి ఇష్టం. కానీ బిగుతయిన ప్యాంట్లు, స్కర్ట్ లు, లెగ్గింగ్ లు వంటివి వేసుకోవడం వల్ల చర్మం రాపిడికి గురై ఎలర్జీలు రావచ్చు. అలాగే క్లోజ్డ్ ఫిట్టింగ్ స్కర్ట్ లు లెగ్గింగ్ ల వల్ల కండరాలు నొప్పులు డిస్క్ సమస్యలు వస్తాయి. అన్నింటికంటే ఎంతో ముఖ్యమైన విషయం ఎత్తు చెప్పులు. ఎక్కువ సేపు మడమలపైనా వేళ్లపైన శరీర భారం పడటం వల్ల రక్తప్రసరణలో హెచ్చుతగ్గులు వస్తాయి ఫలితంగా మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ పై ఒత్తిడి పడి కీళ్ల నొప్పులు వేధిస్తాయి కనుక పాయింట్ హిల్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది.పాదం మొత్తం ఆనుకునేలా ఫ్లిప్ ప్లాప్స్ వంటివి ఎంచుకోవటం మంచిది .

Leave a comment