ఇప్పుడొస్తున్న కొత్త డ్రస్ స్టయిల్ లో పెప్లమ్ చాలా అందంగా ఉంటుంది . నడుము దగ్గర కుచ్చులతో అతికించినట్లుగా ఉండే పెప్లమ్ టాప్స్ . లెహంగా పైకి సరైన ఎంపిక . ఈ టాప్ వేసుకొంటే నడుముకు బెల్ట్ బావుంటుంది . పెప్లమ్ వాడిన వస్త్రశ్రేణి తోనే ఈ బెల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు . లెహంగాను బట్టి ఆభరణాలు ఎంచుకోవాలి . డ్రస్ భారీగా ఉంటే ఆభరణాలు సింపుల్ గా ఉండాలి . హై హిల్స్ చక్కని మ్యాచింగ్ ,సాదా లెహంగా పైకి డిజైనర్ పెప్లమ్ బావుంటుంది . ఇవి శరీర సౌష్టవాన్ని చక్కగా చూపిస్తాయి . తీరైన అందంతో స్టయిల్ గా కనిపించాలి అనుకొంటే స్పెషల్ పార్టీలకు మెరిసే ఎంబ్రాయిడరీ చేసిన పెప్లమ్ టాప్ కి జార్జెట్ లెహంగా ధరిస్తే చాలా బావుంటుంది.

Leave a comment