Categories

ఢిల్లీకి చెందిన ఆర్చి జె మొట్ట మొదటి మహిళా బ్యాగ్ పైపర్ . మనదేశంలో బ్యాగ్ పైప్ శిక్షకులు లేరు. ఆర్చి జె ఒక ఆర్మీ కవాతులో ఈ బ్యాగ్ పైప్ ను ఉపయోగించే వీడియో చూసి దాన్ని ఇష్టపడింది . పుస్తకాలు ఆన్ లైన్ వీడియో ల ద్వారా ఈ బ్యాగ్ పైప్ వాయించటం నేర్చుకోంది . పాశ్చాత్య సంగీతంలో భారతీయ శైలి ని కలుపుకొని మ్యూజిక్ ఆల్బమ్స్ తయారు చేసింది 2018 లో ఇండియన్ ఫస్ట్ ప్రొఫెషనల్ ఫిమేల్ బ్యాగ్ పైపర్ అవార్డును ,రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతులమీదుగా అందుకొంది . ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా 79 దేశాల్లో 4.50 లక్షల మంది సభ్యులు యూట్యూబ్ ఛానెల్ లో ఉన్నారు . అలాగే మిలియన్ల కొద్దీ వీక్షకులు కూడా ఉన్నారు . ఆమె తన కళకు స్నేక్ చర్మార్ అని పేరు పెట్టుకొంది .