కర్నాటక నుంచి ఇంజనీరింగ్ చదివిన తోలి మహిళ రాజేశ్వరీ ఛటర్జీ. బెంగళూరు లోని సెంట్రల్ కాలేజీలో బిఎస్సి హానర్స్ గణితంలో ఎమెస్సి చదివి మైసూర్ యూనివర్సిటీ పరిధిలో ఫస్ట్ రాంక్ సాధించారు రాజేశ్వరి. 1943 లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధన విద్యార్థిగా చేశారు. సమాచార ప్రసార రంగంలో పరిశోధనలు ప్రారంభించి నోబెల్ అవార్డ్ గ్రహీత సర్ సివి రామన్ నేతృత్వంలో పనిచేశారు. తర్వాత అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. పి హెచ్ డీ తర్వాత భరత్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో చేరి తొలిసారిగా సూక్ష్మతరంగాలపై పరిశోధనలు చేపట్టారు.

Leave a comment