నీహారికా,

ఇంట్లో వాళ్ళయినా, పిల్లలయినా, స్నేహితులయినా మనకు నచ్చిన పని చేసినా, మన మాట వినకపోయినా వెంటనే కోపం తెచ్చుకుంటాం. కానీ ముందుగా ఒక్క విషయం గుర్తుకు పెట్టుకోవాలి. కారణాలు ఏవైనా కోపం అనర్థ రహితమే.  ఒక స్నేహం పెంచుకొందుకు చాల కాలం పడుతుంది. కానీ దాన్నీ తెంచుకునేందుకు ఒక్క సెకను చాలు. స్నేహం అచ్చం ఒక చిన్నారి మొక్క లాంటిది. దాన్ని పెంచి పోషించి చక్కగా నవ నవలాడుతూ ఎదుగుతున్నప్పుడు తుంచేస్తే ఏముంది, కష్టం నేల పాలే కదా. స్నేహం కూడా తుంచినట్లే పోతుంది కదా. అందుకే మానవ సంబంధాలను జాగ్రత్తగా పెంచి పోషించు కోవాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళలో మనకు నచ్చిన విషయముంటే చక్కగా పోగిదినట్లే, నచ్చని విషయాలు తిన్నగా చెప్పవచ్చు. కానీ ఆ చెప్పటం కటినంగా ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేలా కాదు. సున్నితంగా చెప్పగలగాలి. మనం చెప్పే విధానంలో ఇద్దరి మధ్య ఉండే భాంధవ్యం మనసులో గుర్తుపెట్టుకొంటూ మాట్లాడాలి. ఆలాగే మనకి నచ్చని వాల్ల గురించి మాట్లాడకూడదు. మన వల్ల ఈ ప్రపంచంలో ఒక్క చీమ అయినా కష్ట పెట్టుకోకూడదు అన్నంత జాగ్రతగా ఉండాలి.

Leave a comment