![చేపలలో పోషకాలెన్నో ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని మెదడు పని తీరుకు మంచిదని అంటారు. కానీ అన్ని చేపలలోను ఒకే పోషకాలు వుండవు. చేపల్లో మైక్రో నుట్రీయంట్లు, ఓమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. మంచి నీటి చేపలలో అవి వుండవు. ఆక్వా ఫిష్స్ కన్నా సీ ఫుడ్స్ ఎంతో మంచివి. చేపలు ఎక్కువగా తినడం వల్ల గ్రీన్ ల్యాండ్ వాసుల్లో చూద్దాం అన్నా ఆర్దరైటిస్ వుండదు. అలాగే గోదావరి జిల్లాలో దొరికే నెత్తళ్ళు పేరు తో పిలిచే చేపలలో, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-బి, బి-12 వంటి అన్ని ఎక్కువే. ఆహారంలో భాగంగా చేపలు తింటే కాన్సర్లు, హృదయ రోగాలు రావు. ఒమేగా ఆమ్లాలు ఎక్కువగా వుండే వీటిని వారానికి రెండు దార్లు అయినా తినమని సూచిస్తున్నారు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్. ప్రోటీన్ల తో పాటు జింక్ సమృద్ధిగా దొరికే ఈ చేపలలో చిన్నారుల కోసం బంగ్లాదేశ్ లో 13 లక్షల చెరువులు తవ్వించారట. గుండెకు చేవ నిచ్చే చేపల్ని భోజనంలో భాగంగా తిసుకోమంటున్నారు డాక్టర్లు.](https://vanithavani.com/wp-content/uploads/2017/03/fishes.jpg)
చేపల్లో ఎన్నెన్నో పోషకాలుంటాయి . మెదడు పని తీరును మెరుగు పరచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి చేపల్లో సార్టైన్ (నూనె కవ్వలు) అని పిలిచే చేపల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ . ఒమేగా -3 ఫ్యాటీ అమ్లాలశాతం ఎక్కువ . ఈ చేప ప్రోటీన్లు జీవక్రియ వేగాన్ని పెంచి క్యాలరీలను కరిగిస్తాయి . అందుకే బరువు తగ్గాలను కొనేవాళ్ళు వీటిని తినచ్చు . జ్ఞాపకశక్తి కి, మెదడు పనితీరు కి మేలుచేసె ఈ చేపల్లో ఒక చిన్నచేపలోనే నాలుగైదు గ్లాసుల పాలల్లో లభించే క్యాల్షియం లభిస్తుంది చర్మ సౌందర్యం పెరుగుతుంది . జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్ లు ఎక్కువే . ఎండపెట్టి తింటే వీటిలోని పోషకాలు నాలుగైదు రేట్లు పెరుగుతాయి . పిల్లల పోషణకు ఎంతో ఉపయోగ పడతాయి ఈ చేపలను ఎండా బెట్టి పొడి చేసి ఇతర ఆహార పదార్దాల పైన చల్లుకొని తింటారు పాశ్చాత్యులు .