కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ దుంపలో ఎన్నో రకాలున్నాయి. మన దగ్గర తెలుపు లేదా లేత పసుపు రంగు గుజ్జు వున్న చిలకడ దుంపలుంటాయి. కానీ పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగు ఇలా ఎన్నో విభిన్నమైన రంగుల దుమ్పలున్నాయి. ఈ రంగుల దుంపలు మరింత తియ్యగా ఉంటాయి.చైనా, కొరియా వంటి దేశాల్లో ఈ దుంపలు కాల్చి లేదా బేక్ చేసి అమ్ముతారు. రక్తంలోని చెక్కని నిల్వల్ని నియంత్రించే గుణం గల చిలకడ దుంపలని, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ మధుమేహం రోగులకి మంచి ఆహారం అని సిఫార్సు చేసింది. పిండి పదార్ధాలు, పిచు, విటమిన్-ఎ,బి,సి,బి9, లు కాల్షియమ్ ఇవన్నీ కలిగి వున్న ఈ తియ్యని దుంప మంచిది ఆహారం. కాల్చి తిన్న, ఉడికించి తిన్న ఎంతో రుచి.

Leave a comment