క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క మంచి లేస్ దొరికితే  అదే పంచదార లేస్. ఎలా చేయాలో చుదాలనుకుంటే sugar lace అని యుట్యూబ్ వీడియో లో చూడొచ్చు. ఇది ఆషా మాషీగా వుండదు అందమైన ముగ్గులాగా, లేస్ డిజైన్ లాగా పల్చని పొరలాగా పంచదార తో తాయారు చేసిన షుగర్ లేస్ తినే పదార్ధం అలా వండేసి వెండి గిన్నె లో పోస్తే సరిపోదు. దానికో అందమైన డిజైనర్ అలంకరణ ఉంటేనే ఇంట్లో పిల్లలు అతిధులు ఆనందిస్తారు. పంచదార ఎండబెట్టిన తెల్ల గుడ్డు సోన, మొక్క జొన్న పిండి, డేక్ట్రిన్ మొదలైనవి కలిపి తాయారు చేసిన ముద్ద తో మోల్డ్ పైన ఇలా రాస్తే చాలు, ఐదే నిమిషాల్లో లేస్ మన చేతుల్లో వుంటుంది. ఈ లేస్ కి పిండి తాయారు చేసే మౌల్ద్ డిజైన్లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. ముగ్గులా ముద్దుగా వుండే వీటిని పువ్వుల ఆకారంలో మౌల్ద్ లో నుంచి తీసి వేడి కాఫీ లో వేసిచ్చినా అతిధులు ముగ్ధులైపోతారు.

Leave a comment