Categories
పువ్వుల్లో ఉండే ఔషధ గుణాలు అర్ధం చేసుకొనే వాటిని సౌందర్య ప్రక్రియల్లో విరివిగా వాడతారు.వాటితో తయారు చేసిన ఫేస్ పాక్స్ ,రసాయనాలు కలిపిన ఖరీదైన ఫేస్ ప్యాక్ కంటే ఉత్తమంగా పని చేస్తాయి.మల్లెపూలు ఒక స్పూన్ పెరుగు ,ఒక స్పూన్ చక్కెర వేళ్ళతో మెత్తగా చిదిమి పాక్ వేసి ఓ అరగంట ఆగేసి కడిగేయవచ్చు.గుప్పెడు గులాబీలను కప్పు నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళను వడగట్టి అందులో గంధం పొడి పాలు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకొవచ్చు. మందార పువ్వులో గులాబీ పువ్వులు ముల్తాన్ మట్టి పెరుగు కలిపి మెత్తగా గ్రైండ్ చేస్తే మంచి ఫేస్ పాక్ తయారు అవుతుంది. ఈ ఫేస్ పాక్ ముఖాన్ని మెరుపులతో నింపేస్తాయి.