ఎప్పుడు 80లనాటి గోళ్ళ రంగుల ఫ్యాషన్ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. రెట్రో ఫ్యాషన్ .మెరిసిపోయే మెటాలిక్ రంగులతో గోళ్ళను పెయింట్ చేయటం ఇవ్వాల్టి ట్రెండ్. ముందుగా ట్రాన్స్ పరింట్ ఎనామిల్ లేదా నెయిల్ గ్లో గోళ్ళకు వేయాలి. గోల్డ్ ,సిల్వర్ ఫాయిల్ గోళ్ళకు అతికించి ఆరిపోయే వరకు అలా వదిలి వేయాలి. ఫాయిల్ రంగు గోళ్ళకు అంటుకున్న తర్వాత నెమ్మదిగా ఫాయిల్ ను తీసేయాలి. ఈ మెరిసే రంగులపైన ట్రాన్స్ ఫరింగ్ ఎనామిల్ కోటింగ్ వేస్తే గోళ్ళకు అంటుకొన్న వెండి ,బంగారు రంగులు చక్కగా నిలబడి ఉంటాయి. ప్రకాశవంతమైన రంగులతో ఈ రెట్రో కలర్ చక్కగా ఉంటాయి. వీటికి నెయిల్ మిడ్ రింగ్ నెట్ జోడిస్తే పూర్తిగా పార్టీ లుక్ వచ్చేస్తుంది.

Leave a comment