అద్భుతమైన రంగులు అద్దుకొని ఆ ఊరు రెయిన్ బో విలేజ్ గా గుర్తింపు తెచ్చుకొంది. ఆ గ్రామాన్ని ఇంత అందంగా తీర్చి దిద్దింది ఓ మాజీ సైనికుడు శత్రుదేశాల నుంచి దేశ రక్షణ కోసం పోరాడిన యోధుడు. హుయంగ్ యాంగ్ ఫు అనే 90 ఏళ్ళ వృద్దుడు.తైవాన్ లోని తైయాంగ్ గ్రామం దేశ రక్షణకు పాటుపడే సైనికుల కోసం తైవాన్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది.పెద్ద వాళ్ళయి పరిస్థితులు మారి అందరూ ఎవరి దారిన వాళ్ళు పోతారు. ప్రభుత్వం ఆ గ్రామాన్ని నేలమట్టం చేయాలనుకొంది. ఈ పెద్దాయనకు అది నచ్చేలేదు .ఊరుని రక్షించుకోవాలని తనెప్పుడో చిన్నప్పుడు నేర్చుకొన్న చిత్రకళ ద్వారా ఊరంతా అందమైన రంగులతో నింపేశాడు. మూడేళ్ళ కష్టం ఫలితంగా ఈ కృషికి ప్రతి ఫలం వచ్చింది. అక్కడి యానివర్సిటీ విద్యార్థులు పూనుకొని ఈ ఊరికి దీన్ని అందంగా దిద్దిన గ్రాండ్ పాకి బోలెడంత ప్రచారం తెచ్చారు. ప్రభుత్వం కూడా ఈ ఊరిని కూల్చేయాలనే ఆలోచన మానుకొంది.

Leave a comment