సృష్టి లోని సౌందర్యం మొత్తం ఒకే చోట పోగుపడి వికసించినట్లు ఇంత అందం ఇంత సౌందర్యం ఎక్కడ లేనట్లు ఎప్పటికీ వాడిపోని అపురూపమేమో అన్నట్లు ఉన్నాయి కానీ చేయి జారిందంటే మాత్రం పగిలిపోతాయి ఇవి పింగాణీ పువ్వులండి ! కోల్డ్ ఫోర్సిలిన్ తో చేసిన ఈ లిల్లీలు, గులాబీలు, చామంతులు చూస్తే వెంటనే తలలో పెట్టుకోవాలని పిస్తుంది. కానీ చేతిలోకి తీసుకుంటే అదే ఏమిటి పూలు రాళ్ళు లాగా ఉన్నాయి అనిపిస్తుంది. ఉక్రెయిన్ కు చెందిన బలెస్వా గలుషెంకో అనే కళాకారిణి కోల్డ్ ఫోర్సిలిన్ తో ఈ పువ్వులు తయారీ మొదలు పెట్టింది. ఈ కోల్డ్ ఫోర్సిలిన్ తో చేసిన పువ్వులు, నిజ పూవులు లాగే మృదువుగా, పూరేకులు, కేసరాలు సహజంగా అనిపిస్తాయి. క్లే తో చేసినప్పుడు చక్కగా ఎలా మలిస్తే అలాంటి రూపంలోకి మారేవి కాస్తా ఆరిపోతే గట్టి పడిపోతాయి . తయారు చేయటం కష్టం కానీ ఆ శ్రమ వృధా మాత్రం పోదు అందంగా వికసించిన తోటలో పువ్వులు కొనుక్కొచ్చి ఫ్లవర్ వాజ్ లో పెట్టినంత సహజంగా ఉంటాయి ఇవి నిజం పూవులైతే వాడి పోతాయి కానీ ఈ పూలు శాశ్వతంగా తాజాగా ఉంటాయి .ఇల్లు అందంగా అలంకరించుకోవాలి అనుకుంటే ఈ చెట్టు కి పూయని పువ్వులను తెచ్చి పెట్టుకోవాలి.ఈ పూల అందం ముందు నిజం పువ్వులు కూడా కాస్త చిన్నబోతాయి చూడండి !
Categories