ఫుట్ బాల్ క్రీడ ఆరోగ్య పరంగా స్త్రీలపై మంచి ఫలితాలను చూపిస్తూందని చెపుతున్నారు శాస్త్రవేత్తలు/ యూనివర్సిటీ ఆఫ్ సౌథరన్ డెన్మార్క్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రోస్ట్రేప్ ఆడవాళ్లకు ఫుట్ బాల్ లో శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రాక్టికల్ గా ఈ అంశాన్ని నిరూపించారు.ఫుట్ బాల్ ఆట శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఫుట్ బాల్ ఫిట్నెస్ ట్రైనింగ్ హైపల్స్ ట్రైనింగ్ ఉంటుంది. స్టామినా ట్రైనింగ్ ఉంటుంది స్త్రెంగ్థ్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కమాట లో చెప్పాలంటే ఈ క్రీడ ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. శరీరానికి సంబంధించి అధిక కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ ఎముకల దృఢత్వం జండర్ వెల్ ఫిట్ నెస్ లపైన ఇదిమంచి ఫలితాలు ఇస్తుంది. ఆడవాళ్లు రోజూ ఒక గంట చొప్పున వారానికి రెండు మూడు సార్లు ఫుట్ బాల్ క్రీడ శిక్షణ పొందితే ఎంతో మంచిది. ఒకవేళ రక్త పోటు వుంటే దాన్ని తగ్గించటంలో ఇది మంచి మందులా పని చేస్తుంది.