కోవిడ్ను ఎదుర్కొనేందుకు మాస్క్ లు సామాజిక దూరాలతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్.  వయసును బట్టి తగినన్ని కేలరీలు అందేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి. చిక్కీలు, ప్రోటీన్ బార్ ల తో పాటు మామిడి, అరటి వంటి పండ్లను స్నాక్స్ గా తీసుకోవాలి. తాజాగా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పప్పు దినుసులు, పన్నీర్, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి. గుడ్డు, చికెన్, చేపలు వంటివి ఇమ్యూన్ సెల్స్ వృద్ధి చేయటమే కాకుండా  యాంటీ బాడీస్ ఉత్పత్తికి తప్పనిసరి. సిట్రస్, ఫలాలు  ఆరెంజ్ పసుపు రంగు పండ్లు కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, విటమిన్-సి, క్యారెట్, గుమ్మడి ఇంకా ఆకుపచ్చ కూరల్లో విటమిన్-ఎ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం వెన్న, నెయ్యి, అవకాడో, చేపలు తినాలి ఆరోగ్యాన్నిచ్చే ఆహారంతో పాటు తప్పనిసరిగా వ్యాయామం కూడా ముఖ్యం, ఏ వయసు వారికైనా నడక చక్కని ఎక్సర్ సైజ్ వారం లో రెండున్నర గంటలు నడిచినా మంచిదే అంటున్నారు ఎక్స్పర్ట్స్.

Leave a comment