యువరాజ్ సింగ్ ప్రముఖ క్రికెటర్ భారత ప్రభుత్వం నుంచి అర్జున్, పద్మశ్రీ పురస్కారాలు పొందాడు క్రికెట్ మైదానం లో అడుగుపెడితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే యువరాజ్ గుండె ఎదుటి మనిషి కష్టాలకు కరిగిపోతుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అతని సాయం క్రికెట్ రికార్డుల కంటే గొప్పది ఆసుపత్రిలో బెడ్లు, దొరక్క, ఆక్సిజన్ అందక ప్రజలు కరోనాతో పిట్టల్లా రాలి పోతుంటే తన స్వచ్ఛంద సంస్థ యు వియ్ కెన్ ( youwecan ) ద్వారా బాధితులకు వెయ్యి చేతులతో ఆదుకున్నాడు. పద్నాలుగు రాష్ట్రాల్లో పది లక్షల హైజెనిక్ కిట్లు సరఫరా చేసినట్లు సంబంధిత సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేశారు. వెయ్యి క్రిటికల్ కేర్ బెడ్లను రెండువేల ఆక్సిజన్ సిలిండర్ లను,వంద వెంటిలేటర్ల ను సమకూర్చిందీ సంస్థ. ఈ సాయం వల్ల నెలకు 6000 మంది కరోనా బాధితులకు వైద్యం దక్కింది. క్రికెట్ తో ఎన్నోసార్లు దేశాని గెలిపించిన యువరాజ్ సింగ్ ఈ కరోనా సమయంలో ‘మీరు ఒంటరి వాళ్ళు కారు’, మేము మీతో ఉన్నామంటూ బాధ్యతలకు చేయి అందిస్తున్నాడు  యు వియ్ కెన్ ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గుర్ గావ్ లోని క్యాన్సర్ బాధితులకు లక్ష మంది వైద్యం అందిస్తున్నాడు.ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు ఏడున్నర లక్షల మందికి సర్వీస్ చేశారు. క్రికెట్ తో లక్షల మంది హృదయాల్లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న యువరాజ్ సింగ్ సేవతోనూ మరింత మందికి దగ్గరయ్యాడు.

Leave a comment