గట్టిగా వేళ్ళతో పట్టుకుంటేనే చితికి పోతుంది అనిపించే గుడ్డు తో అద్భుతమైన బొమ్మలు, గుడ్డు శిల్పాలు, ఎంబ్రాయిడరీలు, గోడ చిత్రాలు చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఉక్రెయిన్ లో కళాకారులు గుడ్డు పైన అద్భుతమైన జానపద చిత్రాలు, దేవతా రూపాలను, ప్రకృతి దృశ్యాలను వ్యక్తుల రూపాలనీ అద్భుతంగా గీస్తారట. తేనెపట్టు నుంచి తీసిన మైనం తో రంగులు కలిపి సన్నని సూదితో గుడ్డు పైన జానపద డిజైన్ లు గీయటం అక్కడి కళాకారులకు మాత్రమే సాధ్యం. ఈ ఆర్ట్ ని పైశాంక అని పిలుస్తారు. అట్లాగే గుడ్డు పెంకు పైన సూది వంటి పరికరంతో అచ్చం లేసు అల్లిక లాగా ఆకులు పువ్వులూ ఈకలూ పక్షులు,సృష్టి లోని సకల ప్రాణులను చెక్కేస్తున్నారు .ఈ గుడ్డు శిల్పాలకు రంగులు వేసి బెడ్ ల్యాంప్ లుగా తయారుచేస్తున్నారు. చిన్న చిన్న గుడ్డు పెంకులను చక్కగా కావల్సిన సైజుల్లోకి విరిచి రంగుల్లో ముంచి జిగురుతో అతికిస్తు ఫోటో ఫ్రేములూ,వేజ్ లు పులా కుండీలు ఎన్నో రకాల వస్తువులు కళ్ళను కట్టి పడేసేలా రూపొందిస్తున్నారు కళాకారులు. గుడ్డు పైన అందమైన ఎంబ్రాయిడరీ డిజైన్ లు వేస్తూ వాటిపైన పూసలను రాళ్లను అలకరిస్తూ అద్భుతమైన డిజైన్లు సృష్టిస్తున్నారు కళాకారులు. అంతేనా గుడ్డుతో నగల బాక్స్ లు చేస్తున్నారు కొందరు ఎగ్ డిజైనర్లు. సృజన శక్తి ఉండాలే కానీ ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏదీలేదు.
Categories