చర్మ సౌందర్యానికి సి-విటమిన్ చాలా అవసరం అంటారు డాక్టర్లు. సి-విటమిన్ ఉండే ఆహార పదార్థాలు సరైన మోతాదులో తీసుకుంటే సరిపోతుందని నిమ్మ, నారింజ, బెర్రీస్, బ్రోకోలి తింటే చర్మానికి మంచిదంటున్నారు. సి-విటమిన్ శరీరంలో ఉత్పత్తి చేయలేదు. కచ్చితంగా ఆహారం నుంచే సి-విటమిన్ శరీరానికి అందుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాల వల్ల కణాలు పాడైపోకుండా ఉండాలంటే విటమిన్-సి చాలా అవసరం ఇది సన్ స్క్రీన్ లాగా పనిచేయదు కానీ చర్మం పైన ఉండే నల్ల మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ రాకుండా సి-విటమిన్ పనిచేస్తుంది. చర్మం మెరుపుగా మెత్తగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఏజింగ్ క్రీముల్లో కూడా సి-విటమిన్ తప్పనిసరిగా ఉంటుంది. సిట్రస్ ఉండే పళ్లలో సి-విటమిన్ ఉంటుంది. చర్మాన్ని అందమైన చర్మం కోసం సి విటమిన్ అధికంగా ఉండే కొత్తిమీర, రెడ్ పెప్పర్, బ్రోకోలి వంటివి తీసుకోవాలి.
Categories