జంతువుల పై ప్రేమతో జంతు ప్రేమికులు తమకు ఇష్టమైన వాటిని దత్తత తీసుకుంటున్నారు. 2001లో ప్రారంభమైన ఈ దత్తత కార్యక్రమం నేటికి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏడు జంతువులను దత్తత ఇచ్చాం. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ హైదరబాద్ ఫౌండర్ తుమ్మల రచన చౌదరి జూలోని రాయల్ బెంగాల్ టైగర్ సూర్య ని దత్తత తీసుకున్నారు. ఆ టైగర్ పోషణ బాధ్యత ని తీసుకుని లక్ష రూపాయాల చెక్కును అందజేశారు అని చెప్పారు జూ క్యూరేటర్ క్షితిజ. నగరంలో అనేక మంది ప్రముఖులు జంతువుల దత్తత పై ఆసక్తి చూపడం ఆనందంగా ఉందన్నారు జ్యూ క్యూరేటర్.