నిండుగా విరబూసిన గులాబీలు, మల్లెలు, మందారాలు కళ్ళకి మనసుకి ఆనందం. ఈ పూలు ఎప్పటికీ వాడిపోని వైతే ఎంత బావుంటుంది. అందుకే ఈ మధ్య తాజాగా ఎప్పటికీ వసివాడని మట్టి పూలనే ప్రేమిస్తున్నారు అందరూ. నాణ్యమైన ప్లాస్టిక్, నైలాన్, రేయాన్, కాటన్ దారాలను ఉపయోగించి చేసే కృతిమ పూల కంటే పాలీక్లే తో వచ్చే తాజా పూలు కళ్ళను మోసం చేసేంత తాజాగా ఉంటున్నాయి. ఈ మట్టిపూలు కేరాఫ్ అడ్రస్ థాయ్ లాండ్ ప్లాస్టిక్ మట్టితో మనియేచర్ ఉద్యానవనలా చేసి వాటితో ఇళ్లను అలంకరించుకొంటారు థాయ్ వనితలు. పాటీలీ అనే కళాకారిణి తయారుచేసిన పాలిమర్ క్లే పూలు అవి తయారు చేసిన పువ్వులంటే నమ్మశక్యంగా ఉండదు. పాలీ వినైల్ క్లోరైడ్ అనే కృతిమ పదార్ధం తో ద్రవ రూపంలోని జింక్ ఆక్సైడ్,కయోలిన్ కలిపి దాన్ని ప్రత్యేకమైన ఓవెన్ లో కాచ్చితే పాలిమర్ క్లే తయారవుతుంది. ఈ మట్టితో ఎన్నో రకాల బామ్మలు తయారు చేస్తారు. పూలరేకుల్లోని సున్నితాన్ని సహజమైన మెరుపునీ తేవటం కోసం థాయ్ వాసులు ఈ మట్టిలో ఎన్నోరకాల పదార్ధాలు కలిపి సొంతంగా మట్టి తయారు చేసుకొంటారు. మట్టిలో కలిపే పదార్ధాల కన్నా దాన్ని మెత్తగా నలిపి పూరేకుల్లా తయారు చేయటం లోనే ఉంది అసలైన కళ అందుకే థాయ్ కళాకారులు చేసే పూవులకు ఇంకేవీ సాటిరావు. ఆ పూల అందమే అందం !
Categories