పిల్లలు టీనేజ్ లోకి వచ్చేసరికి వాళ్ళ అకాడమిక్ పనులు, వ్యాపకాలు రెండు పెరుగుతాయి ఇటు చదువు , చురుకైన సామాజిక జీవనం వంటి పనులు మధ్య ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ముందు తినే ఆహారం పైన శ్రద్ధచూపాలి.  విభిన్నమైన ప్రొటీన్ పదార్థాలు తింటూ ఉండాలి. తప్పనిసరి బ్రేక్ ఫాస్ట్ చేయాలి. చాలినంత మంచినీళ్లు గుర్తుపెట్టుకోని మరీ తాగాలి. పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తినాలి.  బైక్ రైడ్ చేస్తూ ఫిజికల్ ఫిట్ నెస్ గురించి ఆలోచించదు కనుక తప్పనిసరిగా కాస్త సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. లెక్కలేని వ్యాపకాల నడుమ భోజనం ఎగ్గొడుతూ ఉంటారు. లేదా నాజుగ్గా ఉండటం కోసం భోజనం మానేస్తారు. ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తప్పనిసరిగా నడక కు ప్రాధాన్యం ఇవ్వాలి. టీనేజ్ లో నిద్ర విషయం ప్రాధాన్యత అనిపించదు కానీ ఆరోగ్యం కోసం  నిద్ర వేళలు పాటించి తీరాలి. వేలకొద్దీ పిల్లలు ఉపయోగించుకొనే టాయిలెట్స్ వడుతూవుంటారు కాబట్టి జలుబు వైరస్ లు ఒకరి నుంచి ఒకరికి తేలిగ్గా వ్యాపిస్తాయి. వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. చేతులను శుభ్రంగా ఉంచుకోవటం వల్ల అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండే వీలుంటుంది. చేతులు కడుక్కోకుండా నోరు, ముక్కు, కళ్ళు అసలు ముట్టుకోకూడదు జలుబు దగ్గు వంటివి ప్రభావం చూపకుండా ఎక్కువ ద్రవ పదార్థాలు మంచి నీళ్లు తాగాలి. ఇలాంటి చర్యల ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకుంటే అనారోగ్యాల మాటే ఉండదు.

Leave a comment