కరోనా కాలంలో, లాక్ డౌన్ వల్ల సరుకులు ముందే ఎక్కువ కొని నిల్వ చేసుకోవలసి వస్తోంది. ఆ సరుకులు పాడైపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాలిష్ పట్టిన లేదా పట్టని బియ్యం గాలి చొరబడిని డబ్బాల్లో 40 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే 30 ఏళ్లయినా పాడైపోవు .గోధుమలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా 6 నెలలకు మించి నిల్వ ఉండవు ఉప్పు తయారీలో కలిపే అయోడిన్ మూలంగా మెత్తని ఉప్పు నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. ఉప్పు ప్యాకెట్లు ఒకటి తర్వాత ఒకటి వాడుకోవాలి. చక్కెర తేమ లేని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. కాచిన వెన్నెల నెయ్యి ఫ్రిజ్ లో ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి. కందులు, మినుములు, చిక్కుడు, సోయా, రాజ్మా మొదలైన గింజలు తేమ లేకుండా వేయించి నిల్వ చేస్తే నెలల తరబడి తాజాగానే ఉంటాయి. పాలపొడి కూడా డబ్బాలో నిలువ ఉంచుకోవచ్చు.

Leave a comment