Categories
చెర్రిలు,స్ట్రాబెర్రీలు ,ఆపిల్స్ ,ఫైనాపిల్స్,మనకి ఇష్టమైన పళ్ళ జాబితాలో ముందుంటాయి. ఇప్పుడు ఇవి కాస్త ధగ ధగలాడే నగల వరసలోకి వచ్చాయి.ఈ పండ్లు కాస్త రత్నాలు ముత్యాలు సొగసులద్దుకుకొని అందమైన ఫ్రూట్స్ డిజైన్ కలక్షన్స్ గా మార్కెట్ లోకి వచ్చాయి. పగడపు పూసలు,రత్నాలు కెంపులతో ఎనామిల్ కోబెంట్ లతో అచ్చు ఆయా రూపంలో వచ్చేట్లు అనేక ఆకులు కొమ్మలు వచ్చేట్లూ ఆకర్షణీయంగా తీర్చి నిపుణులు ఈ పండ్ల డిజైన్ నగలు చెవులకు దిద్దులు మెడలో పెండెంట్లుగా ,ఇటు సంప్రదాయ దుస్తుల పైకి అటు ఆధునికమైన సల్వార్,కుర్తీల ,మ్యాచింగ్ గా కూడా చాలా అందంగా ఉన్నాయి.