చక్కగా పువ్వులు పూయటం సరే అవి కాస్తా సాయంత్రానికి రంగులు మారిపోవటం, పైగా ఒకే కొమ్మకి రెండు మూడు రకాల్లో కి వర్ణ విన్యాసం చేయడం ఆశ్చర్యం కదా. పత్తి మందార హైడ్రాంజియాకమలియాన్ రోజ్, ల్యాంటానా  మార్నింగ్‌ గ్లోరీలు ఇలా రంగులు మార్చే పువ్వులతో ఉంటాయి. ఇందులోని వర్ణద్రవ్యాలు సూర్యకాంతితో చర్య పొందడంతో పాటు వేళ్లు గ్రహించే పోషకాల్ని బట్టి కూడా రంగులు మార్చే చేయగలుగుతాయి అంటున్నారు పరిశోధకులు ఒకే చెట్టుకి లేత పసుపు, ఉదా, నీలం, ఎరుపు, గులాబీ రంగులో కనిపించే హైడ్రాంజియాల్ని  చూస్తే ఎవరో కావాలని పూల బొకేలు చేశారన్నట్లు కనిపిస్తాయి ప్రకృతి మనిషికి ఇచ్చే బహుమతులు ఇవన్నీ.

Leave a comment