మనస్తత్వశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న సౌమ్యసింగ్‌ రాథోడ్‌ గేమింగ్‌ ఇండస్ట్రీలో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది.మహిళా సంపన్నుల జాబితా (హురున్‌ పవర్‌–లీడింగ్‌ వెల్దీ ఉమెన్‌ 2021)లో చోటు సాధించింది. నాలుగేళ్ళ క్రితం పవన్‌ నందాతో కలిసి దిల్లీ కేంద్రంగా ‘విన్‌ జో’ పేరుతో సోషల్‌ గేమింగ్‌ యాప్‌ మొదలు పెట్టింది సౌమ్యసింగ్‌.‘క్విక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ లక్ష్యంతో రకరకాల జానర్స్‌లో యూత్‌ను ఆకట్టుకునే గేమ్స్‌ రూపొందించింది.‘విన్‌ జో’ ద్వారా పరోక్షంగా, ప్రత్యక్ష్యంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. సౌమ్య ముఖ్యంగా ‘రెస్పాన్సిబిలిటీ గేమింగ్‌’కు ప్రాధాన్యత ఇచ్చింది.ఆ ఆటకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఇవ్వదు భారత్ గేమింగ్ ఆన్ లైన్ మార్కెట్ లో తన డైన ముద్ర వేసింది సౌమ్యసింగ్‌ రాథోడ్‌.

Leave a comment