మూషిక వాహన మురిపెము తీరా

 తలచెద నిన్ను తనివి తీరా!!

గణపతి నవరాత్రులు ఈ రోజుతో ముగింపు కదా చెలులూ!! గణపతిని ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి హడావుడి గా రోజు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షిస్తూ, స్వామికి ప్రసాదాలు తయారు చేస్తూ ఇట్టే గడిచిపోయింది.
ప్రతి నిత్యం గణనాధుడిని పూజిస్తే నిర్విఘ్ననంగా అభయం ఇచ్చి వరాలను ప్రసాదిస్తాడు.విజయం సాధించే మార్గాన్ని చూపిస్తాడు.పార్వతి దేవి ముద్దలహహబ తనయుడైన బుడి  బుడి అడుగులతో అందరికి దర్శనం ఇస్తారు.విద్యార్థులు తమ పుస్తకాలు, కలము పెట్టి చల్లని చూపులు ప్రసరింప చేయమని ప్రార్థన చేస్తూ సంగీతం పాడుతూ, నృత్యం చేస్తూ గణపతి దేవుని కటాక్షం పొందుతారు.

ఇష్టమైన రంగు:తెలుపు
ఇష్టమైన రోజు: బుధవారం
నిత్య ప్రసాదం: కొబ్బరి, పులిహోర,కుడుములు.

జై బోలో గణేష్ మహరాజ్ కీ జై!!

      -తోలేటి వెంకట శిరీష

Leave a comment