Categories
కోవిడ్ సోకిన వాళ్ళు మౌత్ వాష్ తో బాగా పుక్కిలించడం వల్ల నోట్లోనూ గొంతులోనూ ఉండే వైరస్ శాతం తగ్గుతుంది అంటున్నారు అధ్యయనకారులు.అత్యధిక శాతం వైరస్ నోట్లోనూ గొంతులోనూ ఉంటుందని గుర్తించారు,పైగా కోవిడ్ వైరస్, తుమ్మటం ద్వారా దగ్గడం,మాట్లాడటం ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది.ఇప్పటికే పరిశోధనల్లో తేలింది.వైరస్ లక్షణాలు పెరుగుదలను నియంత్రిస్తుందని చెప్పలేము కానీ మౌత్ వాష్ తో లేదా ఉప్పు నీళ్లతో పుక్కిలించడం ద్వారా కొంతసేపు గొంతులో వాటి శాతం తగ్గి వ్యాప్తి తగ్గుతోందని వివరిస్తున్నారు నిపుణులు.