నీహారికా,

నేనందరిలా పర్ఫెక్ట్ గా ఉన్నానా? నా ఆలోచనలు సరైనవా కాదా అనే సందేహం అన్నావు, అసలు నువ్వు ఇతరులతో ఎందుకు పోల్చుకొంటావు. ప్రతివారికీ ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఇంకోళ్ళలా వుండటం ఎందుకు? మన చుట్టూ ఉన్న సక్సెస్ ఫుల్ పీపుల్స్ లో మనం కూడా ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడెలా ఉండాలి అప్ డేట్ గా, సమకాలీన పరిస్థితులు, తాజా ఆర్ధిక సాంఘిక రాజకీయ విషయాలు తెలుసుకోవడం కోసం న్యూస్ పేపర్లు, మేగజైన్లు ఎంచుకో. మన చుట్టూ వున్నా వాళ్ళతో కలిసిమెలిసి వుండాలి. అప్పుడు చుట్టూ స్నేహ సౌరభo వుంటుంది. ఒక లక్ష్యం ఉంచుకో, అది రోజు, వారం, నెల లేదా జీవిత కాలపు లక్ష్యం కూడా కావచ్చు. ఆ లక్ష్యం ఎదురుగా నడువు, ఏం సాధించావు, ఇంకా ఏం చేయాలి? ఈ ఆలోచనలతో బిజీ గా వుంటే నెగిటివ్ ఆలోచనలే వుండవు. కొత్తగా ఆలోచించు సమ్ థింగ్ న్యూ. అది అందరూ ఆదరించేది, మనసుని రంజిపజేసేది అయి వుండాలి. ఆ ఆత్మ సంతృప్తి , ధైర్యం జీవితంలో నువ్వు ఎక్కే ఎన్నో మెట్లకు పునాది అవుతుంది. మంచి ఆలోచనలతో, మంచి ఆరోగ్యంతో, మంచి అలవాట్లతో సంతోషంగా వుండు. ఎప్పుడు ఏ కొంచెం సాయం పొందినా దాన్ని మరచిపోకు, నువ్వు పర్ఫెక్ట్ గా ఉండటం అంటే ఇదే. ఒక చిన్న మొక్క రెండాకులతో గింజ నుంచి బయటపడి, చక్కని వెలుగుతో, గాలి, ప్రకృతితో సంతోషంగా ఎదిగి వృక్షం అవుతుంది. మనుషులు అంతే ఆరోగ్యవంతమైన ఆలోచనలతో ఎదగాతమే జీవిత విధానం.

Leave a comment