19 గిరిజన భాషలకు లిపి తయారు చేసినందుకుగాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు శాశ్వతం చేసుకొన్నారు ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి అవార్డ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు ప్రసన్న శ్రీ. గిరిజనులను ఇతరులతో మాట్లాడటం సమస్య. వారు వారి భాషలో తప్ప ఇతర భాషల్లో మాట్లాడలేరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు కనుక వారికి ఇతర భాష నేర్చుకునే అవకాశం లేదు. అసలు వాళ్ళ భాషకు లిపి తేనే లేదు. గిరిజనలు పట్నాలకు వలస వచ్చాక కొన్ని భాషలే కనుమరుగైపోతున్నాయి. అలాంటి పరిస్థితిలో ప్రసన్నశ్రీ గిరిజన భాషలపై 20 ఏళ్ళ పాటు పరిశోధన చేసి 2019లో వాల్మీకి భాషకు సంబంధించిన కుకియా మొదటి లిపి రూపొందించారు తర్వాత క్రమంగా భగత, గదబ, ధ్రువ, గోండి, కోయ, గౌడ్‌, జాతాపు, కమ్మర, కొలామి, కొండదొర, కొటియా, కుపియా (వాల్మీకి), మాలి, వంటి గిరిజన తెగల భాషలకు లిపి కనిపెట్టారు తిరుపతి లోని మహిళా విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు ప్రసన్న శ్రీ.

Leave a comment