అన్నం వండేప్పుడు గంజి వారిస్తే పోషకాలు పోతాయ్ అంటారు కానీ ఇలా గంజి వార్చిన అన్నం తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. గంజి వార్చిన అన్నంలో థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, లాంటివి విటమిన్లు దాదాపుగా 70 శాతం, పిండి పదార్థాలు పది వరకు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెపుతున్నారు. ఈ అన్నంలో పిండి పదార్థాలు తక్కువ జీర్ణం అయ్యేందుకు సమయం తీసుకునే రెసిస్టెంట్ స్టార్ట్ మోతాదు ఎక్కువ. బ్లడ్ షుగర్ తగ్గించేందుకు ఇది మంచి మార్గం కానీ ఇలా గంజి వార్చిన అన్నం తింటే విటమిన్ల లోటును భర్తీ చేసేందుకు ఏం తీసుకోవాలో నిపుణుల సలహా తీసుకుంటే ఉత్తమం.

Leave a comment