అన్ని బంగారు నగలే వుండవు. అమ్మాయిల ఫ్యాషన్ ఎంపికలో ఎన్నో రకాల మెటల్ ఆధారాలుంటాయి కానీ ఇలాంటివి చర్మానికి ఎన్నో అలర్జీలు తెచ్చిపెడుతుంటాయంటున్నారు డెర్మటాలజిస్ట్ లు. ఎదో చిన్న పాటి చెయిన్ లేదా మెటల్ గాజు వేసుకున్న చర్మానికి అలార్జీ వస్తే దాన్ని డెర్మటైటిస్ అంటున్నారు వైద్యులు. ఈ వస్తువుల్లో వుండే లోపం కారణంగా అలర్జీ వస్తుంది.చాలా ఇష్టపడి వేసుకున్న చుడీదార్ పైన అద్దిన రంగులవల్ల కుడా డెర్మటైటిస్ రావచ్చు. సౌందర్య సాధనల్లోని రెసార్సిన్ బామ్స్ పెరూ, పర్ ఫ్యుమ్స్ లో వాడే రసాయినాల తో అలర్జీ రావచ్చు. అలా ఎలర్జీ వచ్చి దురదగా అనిపించినా, చర్మం రంగు ఎరుపెక్కినా, మారిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. వెంటనే ఏదైనా ముందు వేసుకోకపోతే అదే చాలా ప్రమాదం అయిపోతుంది. వీళ్ళంతా వ్యాపించె అవకాశముంది.

Leave a comment