ఈ వరుసలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయి అందుకని కాలేజీల్లో క్లబ్ లు ఏర్పాటు చేస్తున్నాం దానిలో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు సగం అబ్బాయిలు ఉంటారు. ఈ 25 మంది సేఫ్టీ క్లబ్ గా ఉండే కాలేజీల్లో సమస్య వస్తే ఎలా స్పందించాలి అన్న విషయంపై వాళ్లకు శిక్షణ ఇస్తాం అంటున్నారు తెలంగాణ షీ టీమ్స్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజి సుమతి పిల్లల భద్రత కోసం 1650 స్కూళ్లలో సైబర్ కాంగ్రెస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం పట్టణ గ్రామ స్థాయిలో టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం అంటున్నారు సుమతి.