‘ FIND YOUR BEAUTI FUL’ పేరుతో రాధికా ఆప్టే రూపొందించిన ఒక వీడియో కు సోషల్ మీడియా లో చక్కని స్పందన వచ్చింది. అందులో రాధికా ఆప్టే తన కాలేజీ రోజులనాటి ఫోటోలు ఇంకా చిన్నప్పటి ఫోటోలు చూస్తూ అప్పుడు తాను అందంగా లేననుకునేదాన్ని అంటూ కబుర్లు మొదలుపెడుతుంది. కళ్ళు బాలేవు పళ్ళు బాలేవు లావుగా ఉన్నారనే మరీ సన్నగా ఉన్నారనే చిన్న జుట్టు అనో రంగు తక్కువ అనో ఇలా అందంగా లేరని చెప్పేందుకు ఎన్నో కారణాలు చెపుతూ వుంటారు. అసలు అందమంటే పదిమందికీ నచ్చేందుకు కాదు మనకి మనం బావుండటం అని చెప్తూ ఆడపిల్లలో ఆత్మ విశ్వాసం నింపే ప్రయత్నం చేసింది రాధికా ఆప్టే. అసలు ఆడవాళ్ళందరూ తమ సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే ఎన్నో స్టిల్స్ చాలా బావున్నాయి ఈ వీడియోలో. ఇంతక ముందు శృతి హాసన్ రూపొందించిన ‘ది బిచ్’ స్టార్ ఫిల్మ్ కు ఎంతో మంచి స్పందన వచ్చింది. అందరి దృష్టిని ఆకర్షించగలిగిన హీరోయిన్లు ఇలా సామజిక అంశాల పైన స్పందిస్తే చాలా మందిని మార్చగలుగుతారేమో.
Categories