పెదవులు పగిలిపోకుండా లిప్ బామ్ మాత్రమే సరిపోదు ఇంకా సంరక్షణ చేయాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . తేనె చక్కెర తీసుకొని ఆ మిశ్రమాన్ని పెదవుల పై రాసి మృదువుగా మర్ధనాచేసి కాసేపటి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే పెదవులపై మృత కణాలు పోయి చక్కగా కనిపిస్తాయి. అలాగే టోమోటో రసంలో చాక్లెట్ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులపై రాసి ఆరిన తర్వాత నీటితో కడిగేస్తే మృదువుగా అయిపోతాయి. ఇలా అయ్యాక లిప్ బామ్ రాసుకుంటే ఇంకా ప్రయోజనం ఉంటుంది.

Leave a comment