వెంటిలేటర్ ఆన్ మరాఠీ సినిమా కోసం ప్రియాంక చోప్రా స్వయంగా పాడిన బాబా సాంగ్ కు రెండు రోజుల్లో ఆరు లక్షల హిట్స్ వచ్చాయి. ఈ సినిమా నిర్మాత ప్రియాంకనే. అయితే ఆమె ఈ సినిమాలో నాటించ లేదు. పాట చాలా బాగుంది. ‘నాన్న నీ మనసు లోని బాధను నేనెప్పుడు అర్ధం చేసుకో లేదు. నేనిలా జీవించాలి చెప్పు నేనెటు వైపు వెళ్ళాలి నాకేమి తెలియడం లేదు. నిన్నిలా అడుగుతుంది నీ ప్రియమైన కూతురు. నువ్వు నా జీవితానికి నిజమైన అర్ధం ఇచ్చావు నాన్న……. దయచేసి ఆగు……….. వెళ్ళిపోకు. పాట ఇలా సాగుతుంది తండ్రి వెంటిలేటర్ మీద వున్నప్పుడు కూతురు పాట ఇది. 4 నిముషాల 12 సెకెండ్లు వున్న ఈ పాట నెట్లో ఎంతో మంది విని ఇష్టపడ్డారు.

Leave a comment