ఎదిగే వయసు పిల్లల్ని డీల్ చేయటం అంత ఈజీ టాస్క్ కానే కాదు. అప్పటిదాకా అల్లరిగా ముందుగా గోల చేస్తూ అమ్మని నాన్నని గారాబంగా అడుగులు ఏడ్చే పిల్లలు 16 ఏళ్ళు వచ్చేసరికి కామ్ గా అయిపోతారు. వాళ్ళు పర్సనల్ గా ఉండాలనుకుంటారు ఇక తమ నుంచి ఎదో దాస్తున్నారని భావన కొంత మంది తల్లితండ్రుల్లో కలుగుతుంది. ఏమడిగినా సరిగా సమాధానం లేకుండా దాటేస్తూ వెళ్ళటం ఇందుకు కారణం. అస్తమానం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ప్రతి విషయాన్నీ నిశితంగా గమనించే వాళ్లలో ఇలాంటి భయాందోళనలు చోటు చేసుకుంటాయి. కానీ పిల్లలో తమపైన ప్రాధాన్యతలు అభిరుచులు ఇష్టాలు ఏర్పడుతున్నాయని గ్రహించలేకపోతారు. ఒక రకంగా ఎదిగే పిల్లలో ఇది సహజమే. పిలల్లు కోరుకునే స్వేచ్ఛ తల్లితండ్రుల నియంత్రణ ఘర్షణ కు దారి తీస్తూవుంటాయి. స్వేచ్ఛ కోరే పిల్లలు ఏది పడితే దాన్ని కోరుకోవచ్చు. అని నిర్ణయించటమూ అది నిరంతరం తప్పని పెద్దవాళ్ళు ఖండించటం రెండూ తప్పే. పిలల్లకు ఏది మేలు చేతుందో దాన్ని అనుభవంతో చెపుతున్నారని పెద్దవాళ్ళు పిల్లలతో అర్ధమయ్యేలా మాట్లాడగలిగినప్పుడే సమస్యలు పోతాయి. అలాగే పిల్లలు తమ పరిమితులు తెలుసుకుని ప్రవర్తించాలి కూడా ఇద్దరి మధ్య సమన్వయం కుదిరేలా ఒక మంచి వాతావరణం కల్పించే బాధ్యత ఖచ్చితంగా పెద్దలదే.
Categories
WhatsApp

పిల్లలు స్వేచ్ఛ కోరటం చాలా సహజం

Leave a comment