గుజరాత్ లోని సూరత్, సురేంద్రనగర్, బోర్చి బావ్ నగర్  వడారౌల్ దగ్గర గ్రామంల్లోని వేల మంది ప్రజలకు సూక్ష్మ రుణాలు అందించి వారికి ఆర్థిక  స్వావలంబన కలిగిస్తోంది శాంతి లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శీతల్ మెహతా వాల్ష్.తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి సులభ వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది శాంతి లైఫ్ ఇండియా సంస్థ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన శీతల్ కు ఆర్థిక రంగం పై సంపూర్ణ అవగాహన ఉంది. సూక్ష్మ రుణాలు అందించే పల్లెల ముఖ చిత్రాన్ని మార్చాలనే  సంకల్పంతో 2009లో శాంతి లైఫ్ ఇండియా పౌండేషన్ స్థాపించింది. గుజరాత్ తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల లోను సేవలు విస్తరించి,స్వయం సమృద్ధి,స్వచ్ఛ గ్రామాల నినాదం తో సంక్షేమ పదాన్ని కొనసాగిస్తోంది శీతల్.

Leave a comment